అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని వర్ల రామయ్య పేర్కొన్నారు. చంద్రబాబు నివాసంపై డ్రోన్లను ప్రయోగించిన విషయమై ఆయన మీడియాతో
మాట్లాడుతూ.. చంద్రబాబు ఇంటిని డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించాలని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. భౌతికంగా నష్టం కలిగించాలనే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. 
 
సీఎం జగన్‌ ఇంట్లో పనిచేసే కిరణ్‌కు చంద్రబాబు ఇంటికి డ్రోన్లను పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే ఓవర్‌ యాక్షన్‌ చేస్తున్నాడని వర్ల రామయ్య ఆరోపించారు. చంద్రబాబు ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మిమ్మల్ని చంద్రబాబు ఇంటికి కాపలా కాయమని ఆదేశాలు ఇచ్చారా? అని నిలదీశారు. బాంబులు వేయాలని చూస్తున్నారా? అని వర్ల రామయ్య
ప్రశ్నించారు.