టాలీవుడ్: మహానటి` చిత్రంలో సావిత్రిగా అద్భుత నటనతో అందరి ప్రశంసలూ అందుకున్న కీర్తీసురేష్ తాజాగా జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన సంగతి తెలిసిందే. జాతీయ పురస్కారం లభించడంతో
చాలా మంది సినీ ప్రముఖులు కీర్తిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఆమెను అభినందించారు. ఖతర్‌లోని దోహాలో జరిగిన సైమా అవార్డుల వేడుకకు కీర్తి హాజరైంది.ఆ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీంతో చాలా మంది హీరోయిన్లు మెగాస్టార్‌తో పోటీపడి ఫోటోలు తీసుకున్నారు. కీర్తి సురేష్ కూడా మెగాస్టార్‌ను కలిసింది. సావిత్రి తరహాలో సాంప్రదాయ పద్ధతిలో కార్యక్రమానికి వచ్చిన కీర్తి.. చిరంజీవితో ఎంతో వినయంగా మాట్లాడింది: కీర్తి తల్లి మేనక.. చిరంజీవితో కలిసి `పున్నమి నాగు` సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.