.

ప్రస్తుతం టాలీవుడ్‌లో బ్యాచిలర్ హీరోల జాబితా పెద్దదే ఉంది. ప్రభాస్, రానా, నితిన్, శర్వానంద్ వంటి హీరోలు ఇంకా పెళ్లికి దూరంగానే ఉన్నారు. ప్రభాస్, రానాకు పెళ్లి గురించిన ప్రశ్నలు తరచుగా
ఎదురవుతుంటాయి. నితిన్, శర్వానంద్ మాత్రం ఈ ప్రశ్నలను పెద్దగా ఎదుర్కోలేదు. అయితే తాజాగా `రణరంగం` సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న శర్వానంద్‌కు పెళ్లి గురించి ప్రశ్నలు
ఎదురయ్యాయి.35 ఏళ్ల శర్వానంద్ ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదట. అలాగే తనకు గాళ్‌ఫ్రెండ్స్ కూడా లేరట. `అసలు ఇప్పటివరకు పెళ్లి గురించిన ఆలోచనే రాలేదు. నాకు గాళ్‌ఫ్రెండ్స్ కూడా
లేరు. పెళ్లిపై ప్రస్తుతం ఎలాంటి ఆలోచనలూ లేవు. ఎలాంటి అమ్మాయి కావాలనే . ఆ టైమ్ వచ్చినప్పుడు అన్నీ ఆటోమేటిగ్గా కుదిరిపోతాయ`ని శర్వానంద్ చెప్పాడు.