హైదరాబాద్: హెచ్‌సీయూ డిపో దగ్గర నిరసన ప్రదర్శనలో  ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటానికి చేయి కోసుకున్నాడు. హెచ్‌సీయూ డిపో కండక్టర్‌ సందీప్ మనస్ధాపం చెంది బ్లేడుతో చేయికోసుకున్నాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ వంటావార్పు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందీప్ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనై, . తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో చేతిపై మూడు చోట్ల కోసుకున్నాడు. సమయానికి గమనించిన తోటి కార్మికులు అడ్డుకున్నారు. కండక్టర్‌ సందీప్‌ చేతికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది.  సందీప్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు..

చాలా రక్తం పోవడంతో వైద్యులు రక్తాన్ని ఎక్కిస్తున్నారు. సందీప్
కోలుకుంటున్నాడని  సమాచారం. ఆర్టీసీ కార్మికుల సమ్మె పదోరోజుకు చేరుకుంది.
రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు. జీతాలు
రాకపోవడంతో కార్మికులు అష్ట కష్టాలు పడున్నారు. పండగ రోజులు కావడంతో
మరీ కష్టంగా ఉంది.  అంతేకాదు ఆర్టీసీ కార్మికులు ఉద్యోగం పోయినట్లేనంటూ
ప్రభుత్వం చేసిన ప్రకటనతో కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ప్రభుత్వం మొండిపట్టుదలతో పట్టించుకోకపోవడంతో, బలిదానాలు చేసుకున్న కార్మికుల అంత్యక్రియలు కూడా ముగియక ముందే ఈ విచారకర సంఘటన జరిగింది.