విశాఖపట్నం : కరోనా పాజిటివ్ కేసుల లెక్కలను ఏపీ సర్కార్ దాచిపెడుతోందని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న సందర్భంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు తాజాగా సవాల్ విసిరారు. .  ఆదివారం నాడు ఎంపీ విజయసాయిరెడ్డితో కలిసి అవంతి శ్రీనివాస్ మీడియా మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్ముంటే ప్రతిపక్షాలు  ఈ సవాల్ స్వీకరిచాలని ఆయన అన్నారు.  ప్రతిపక్షాలు పదే పదే ప్రభుత్వం కేసులు దాస్తోందని విమర్శలు గుప్పించడం సరికాదన్నారు.  ఒక్క కేసు దాచామని నిరుపించినా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని, ఒకవేళ నిరూపించలేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా..? అంటూ సవాల్ విసిరారు. అంతేకాదు తాను చేసిన ఈ ఛాలెంజ్ స్వీకరించి నిరూపిస్తే రాజీనామా చేస్తానని అవంతి చెప్పుకొచ్చారు. కరోనా కేసులు ఏమైనా డబ్బులా బ్యాంకుల్లో దాచుకోవడానికి అంటూ  ఆయన  ప్రశ్నించారు.