ఇంటర్నెట్ డెస్క్ :దేశంలో కరోనా వ్యాధిని తరిమికొట్టి, విజయ సాధించిన  తొలి రాష్ట్రంగా గోవా నిలిచింది. ఈ విషయాన్ని గోవా ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే వెల్లడించారు. దీనిని సాధించేందుకు ఎంతగానో కృషి చేసిన డాక్టర్లకు ఈ సందర్భంగా ఆయన ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు చెప్పారు.  "సున్నాకు ఎంతో విలువ ఉంది. గోవాలోని కొవిడ్-19 పాజిటివ్ కేసులన్నీ ఇప్పుడు నెగెటివ్ అయ్యాయని వెల్లడించేందుకు చాలా సంతోషంగా ఉంది. తమ ప్రాణాలను పణంగా పెట్టి, రోగులకు చికిత్స అందించి, వారి ప్రాణాలు కాపాడిన డాక్టర్లకు,హెల్త్ వర్కర్లకు చాలా రుణపడి ఉంటాం" అని ఆయన వ్యాఖ్యానించారు.

     జీరో కేసులు ఉన్నా సామాజిక దూరం పాటిస్తామని, లాక్ డౌన్ ప్రాముఖ్యత మనుసులో ఉంచుకుంటామని ఆయన ఒక ప్రకటనలో తెలియ చేశారు. టెస్టులు చేయవలసిన అవసరం ఇంకా ఉందని ఆయన అన్నారు.