న్యూ ఢిల్లీ : కరోనా ప్రభావం జైళ్ల మీద కూడా పడడంతో జైళ్ల లో ఉన్న ఖైదీలను పెద్ద సంఖ్యలో విడుదల చేస్తున్నారు. తీహార్ జైలు నుండి 2962 మంది ఖైదీలను విడుదల చేశారు. క్యాన్సర్, హెపటైటిస్ బీ లేదా సీ, అస్థమా, ట్యూబర్కూలోసిస్‌లతో పాటు ఇతర అనారోగ్యాలు ఉన్న ఖైదీలను  విడుదల చేశారు. కాగా వీరందిరినీ 45 రోజుల పాటు మాత్రమే విడుదల చేశామని, గడువు పూర్తైన తర్వాత తిరిగి జైలుకు రావాలని జైలు అధికారులు పేర్కొన్నారు. వీరందరినీ  బైలు, పెరోల్ మీద విడుదల చేసినట్టు జైలు అధికారులు తెలియచేశారు. జైలులో రద్దీని తగ్గించటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.