న్యూ ఢిల్లీ : సోమవారం నుంచి ఢిల్లీలో ఎటువంటి సడలింపు ఉండదని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలియచేసారు. ఇంకొక వారం చూసి, ఒక వేళ  పరిస్థితి  ఏమన్నా బాగుపడితే, చూసి నిర్ణయం తీసుకుంటామని తెలియ చేసారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ నియాత్రణలో ఉన్న ప్రదేశాలలో సడలింపులు  చేయమన్నారని ఆయన తెలిపారు. కానీ శనివారంనాడు మాత్రం ఎటువంటి రోగ లక్షణాలు లేని 186 కరోనా పొజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. వారికి ఆ వ్యాధి ఉన్నట్టే తెలియదని, ఈ విషయం ఇంకా ప్రమాదకరమని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటిస్తున్న ప్రదేశాలలో  కేసులు పెరగకుండా నిరోధించ కలుగుతున్నామని   ఆయన తెలిపారు.