ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 22 సంవత్సరాల  యువకుడు పోలీసులు కర్కశత్వానికి బలైపోయాడు. ఉత్తర ప్రదేశ్ లోని అంబేద్కర్ జిల్లాలో నివసించే 22 సంవత్సరాల రిజ్వాన్ అహ్మద్ అనే యువకుడు లాక్ డౌన్ సమయంలో బిస్కట్లు కొనడానికి బయటకు వెళ్లడంతో పోలీసులు తీవ్రంగా కొట్టారు. గాయాలు తీవ్రం అవడంతో మూడు రోజుల తరువాత ఆ యువకుడు మరణించాడు. రిజ్వాన్  అంబేద్కర్ జిల్లా లోని చజ్జపూర్ ప్రాంతంలో ఏప్రిల్ 15 వ తారీఖున ఇంటికి కావలసిన వస్తువులు  కొనడానికి బయటకి వెళ్ళాడని  తండ్రి ఇస్మాయిల్  తెలియచేశాడు. రిజ్వాన్ ఆ ప్రాంతంలోని పోస్టు ఆఫీసు దగ్గరకు వెళ్ళగానే ఒక ఒక ఇన్స్పెక్టర్, కొంతమంది పోలీసు కానిస్టేబుళ్లు అపారని, తీవ్రంగా కొట్టారని ఆయన తండ్రి వాపోయాడు. వారు కొట్టిన దెబ్బలకు మూడురోజుల తరువాత మృతిన చెందాడని విలపిస్తూ  ఆయన తెలియచేశాడు. పోలీసుల మీద వచ్చిన ఫిర్యాదులమీద విచారణ జరుగుతుందని, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే చర్యలు తీసుకుంటామని అడిషనల్ SP అవినాష్ కుమార్ మిశ్రా తెలిపారు.