పూరీ జగన్నాధ్ సినిమా దర్శకుడిగా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలీవుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ శుభాకాక్షలు తెలిపారు. కరణ్ జోహార్ విజయ దేవరకొండతో పూరీ నిర్మిస్తున్న చిత్ర నిర్మాతల్లో ఒకరు. పూరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మించిన  తన మొదటి చిత్రం బద్రి ఏప్రిల్ 20 వా తేదీన విడుదల అయ్యింది. తనకంటూ ఒక ఇమేజ్ ని, క్రేజ్ ని తెచ్చుకున్న పూరీ జగన్నాధ్ సినిమాలను అత్యంత వేగంగా నిర్మించే దర్శకులలో ఒకరు. ప్రముఖ హీరోయిన్ ఛార్మీతో పాటు అనేక మంది ప్రముఖులు పూరీ జగన్నాధ్ కు శుభా కాంక్షలు తెలిపారు.