హైదరాబాద్: వివాహేతర సంబంధం పెట్టుకుందని స్థానికులు ఓ మహిళపై దాడి చేశారు.  అడ్డగుట్టలో నివాసముంటున్న యువకుడికి అదే ప్రాంతంలో ఉన్న ఓ మహిళతో పరిచయం ఉంది. వీరిద్దరూ ఆదివారం రాత్రి ఆ మహిళ ఇంట్లో కలిసి ఉండడాన్ని చూసిన ఆ  యువకుడి బంధువులు మహిళపై దాడి చేశారు. దీంతో ఆమె భయంతో తుకారాంగేట్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తాము దాడి చేయలేదని  స్థానికులు అన్నారు. ఫిర్యాదు మేరకు  మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎల్లప్ప తెలిపారు.