హాంకాంగ్: హాంకాంగ్‌లో క్వారంటైన్ నిబంధనలు అతిక్రమించాడని ఓ భారతీయుడిని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మహమ్మారి కరోనా కారణంగా హాంకాంగ్‌లో కఠిన నిబంధనలు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్ నుంచి బయటపడాలని ఆ వ్యక్తి ప్రయత్నించాడని అందుకే అరెస్ట్ చేసినట్లు స్థానిక మీడియా వార్తా వెలువరించింది. 
ఆ వార్తల ప్రకారం...దీపక్ కుమార్ (31) అనే భారతీయ వ్యాపారవేత్త స్థానిక క్వారంటైన్ నిబంధనలను ఉల్లంగించి హాంకాంగ్ నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు.  స్థానిక అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండా నగరం దాటేందుకు ప్రయత్నించడు.  పోలీసుల తనిఖీలో ఈ విషయం వెల్లడి కావడంతో నాలుగు వారాల పాటు దీపక్ కుమార్ కు జైలు శిక్ష విధించారు.