కాన్పూర్: అధికారులకు దొరకకుండా తప్పించుకుంటున్న తబ్లీగీల జాడ కనిపెట్టడంలో సహాయపడ్డ వారికి10 వేల  రూపాయల రివార్డు ఇస్తామని కాన్పూర్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అనేక సార్లు హెచ్చరించినప్పటికీ కొంత మంది తబ్లీగులు తమ వివరాలను చెప్పట్లేదని పోలీసులు తెలిపారు. ఢిల్లీ తబ్లీగీ సమావేశానికి వెళ్లిన వారిలో కొంత మంది దాగి ఉండే అవకాశం ఉందని ఇన్‌స్పెక్టర్ జనరల్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. ఇటువంటి వారు తమ ఆరోగ్యాన్నే కాకుండా ఇతరులను ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉందన్నారు. నగరంలో గత మూడు రోజులుగా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, మొత్తం 74 కేసులు నమోదవగా అందులో ఎక్కువ శాతం తబ్లీగీ ఉదంతానికి సంబంధించినవేనని తెలిపారు. తమంతట తాము అధికారుల ముందుకు వచ్చిన వారిపై ఎటువంటి చర్యలు ఉండవని కూడా ఆయన స్పష్టం చేశారు.