ఇంటర్నెట్ డెస్క్ :  దేశంలో మొత్తం కరోనా కేసులు 18539 కి పెరిగాయి. 592 మరణాలు సంభవించాయి. ఒక్క మహారాష్ట్రలో మాత్రం 466 కొత్త కేసులు నమోదు అయ్యాయి. సోమవారం రాత్రి వరకూ అందిన సమాచారం ప్రకారం వ్యాధిగ్రస్తులలో 9 మంది మరణించటంతో, మొత్తం మరణాల సంఖ్య 232 కి పెరిగింది. వరసగా రెండవ రోజు కూడా గుజరాతులో ప్రమాద ఘంటికలు మొగుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా 196 కొత్తగా పొజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 75 పాజిటివ్ కేసులు రాగా ఒక్క చిత్తూరు జిల్లాలోనే 25 కేసులు బయటపడ్డాయి. దీనితో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 722 కు పెరిగింది.  దేశ రాజధానిలో క్రమ క్రమంగా కేసులు సంఖ్య తగ్గుతూ  వస్తుంది.  ఢిల్లీలో ఈ రోజు 78 కొత్త కేసులు బయటపడ్డాయి.