చైనాలో కోవిడ్-19 కేసుల మరణాలకు  సంబంధించి ట్రంప్ సందేహాలు వెలిబుచ్చారు.  అమెరికాలో కన్నా చైనాలో కోవిడ్-19 మరణాలు ఎక్కువగా ఉండి ఉంటాయని  ఆయన అభిప్రాయ పడ్డారు. రెండు రోజుల క్రితం చైనా ప్రభుత్వం అప్పటిదాకా చెబుతున్న 3300 మరణాల సంఖ్యకన్నా  వూహాన్లో ఇంకా 1300 మంది ఎక్కువ మరణించారని చెప్పటంతో ట్రంప్ ఈ వాఖ్యలు  చేశారు. మరణాల్లో అమెరికా మొదటి స్థానంలో లేదని, నిజానికి చైనానే మొదటి స్థానంలో ఉందని అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు.  శనివారం వైట్ హౌస్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన ఈ అభిప్రాయం వెలిబుచ్చారు. చైనా దేశం కనీసం దగ్గరలో కూడా లేదని మరణాల సంఖ్యలో ఆ దేశం చాలా ముందుందని ట్రంప్ అన్నారు.  ప్రజారోగ్య విధానాలో ఎంతో అభివృద్ధి చెందిన ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జియం, స్పైయిన్, ఇటలీ దేశాలలో మరణాల రేటు చాలా ఎక్కువ ఉండగా   చైనా లో మరణాల రేటు 0.33% ఎలాగుంటుందని ఆయన ప్రశ్నించారు.