హైదరాబాద్: పాన్ ఇండియా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తరువాత  ‘సాహో‘ సినిమాని   దేశవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్ తర్వాతి చిత్రాలను కూడా నిర్మాతలు పాన్ ఇండియా మూవీలుగా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. లాక్ డాన్ నేపథ్యంలో ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోయింది. ఇక ఈ చితం  తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే సినిమాలో ప్రభాస్ నటించనున్నారు. నిర్మాత అశ్వనీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారట. సైన్స్ ఫ్రిక్షన్ నేపథ్యంలో సాగే కథతో ఈ మూవీని రూపొందించనున్నారట. విజువల్ ఎఫెక్ట్స్‌తో పాటు క్యాస్టింగ్ కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారాణి సమాచారం.  ఈ చిత్రం కోసం  బాలీవుడ్ నటులతో పాటు హాలీవుడ్ టెక్నీయన్స్‌ను కూడా రంగంలోకి దింపనున్నారని వార్తలొస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలపెట్టనున్నారని తెలిసింది. ఆర్ ఆర్ ఆర్ ను మించిన బడ్జెట్ తో ఈ సినిమా ఉండేటట్టు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.