ఇంటర్నెట్ డెస్క్: 4 పేజీల సూసైడ్ నోట్ రాసి  ఓ  అమ్మాయి వురి  వేసుకొని జీవితం చాలించింది. ఆగ్రాలో, సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని, దేవి రోడ్డులో ఉన్న శాంతి నగర్ లోని ఇంట్లో  ఏప్రిల్ 16 వ తారీఖున ఆ 16 సంవత్సరాల యువతి మృత దేహం వేలాడుతూ 
కనిపించింది. ఆ అమ్మాయికి 16 ఏళ్లు. . హాయిగా ఆనందంగా  స్కూలుకి వెళ్ళి చదువుకుంటూ, ఆట పాటలతో, స్నేహితులతో జీవితం గడపాల్సిన వయసు.  కానీ ఆ అమ్మాయి జీవితం విషాదాంతమయ్యింది.  10 వ తరగతి చదువుతున్న తన  16 సంవత్సరాల కూతురు చేతికి రివాల్వర్ ఇచ్చాడు  క్రూరమృగం లాంటి ఆ తండ్రి.   ఈ తండ్రి, కుమార్తెతో, ప్రపంచంలో ఏ తండ్రి ప్రవర్తించని విధంగా ప్రవర్తించాడు. గుండెలను కలచి వేసే ఈ విచారకర సంఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగింది.     తండ్రి, బాబాయి  కలసి ఆ 16 సంవత్సరాల అమ్మాయికి ఒక దేశీయ పిస్టల్ ఇచ్చారు. తల్లిని, అన్నను, చెల్లెల్ని చంపమని నూరి పోశారు. కొట్టారు భయపెట్టారు.  ఈ భయంకర పరస్తితులను తట్టుకోలేని ఆ పసి హృదయం మరణమే మెలనుకుంది. 4 పేజీల సూసైడ్ నోట్ రాసి  ఆ అమ్మాయి వురి  వేసుకొని జీవితం చాలించింది. ఆగ్రాలో, సదర్ పోలీసు స్టేషన్ పరిధిలోని, దేవి రోడ్డులో ఉన్న శాంతి నగర్ లోని ఇంట్లో  ఏప్రిల్ 16 వ తారీఖున ఆ 16 సంవత్సరాల యువతి మృత దేహం వేలాడుతూ 
కనిపించింది. పక్కనే  సూసైడ్ నోట్ ఉంది. కానీ ఈ విషయం వెంటనే బయటకు రాలేదు. ఆ యువతి చనిపోవటానికి ముందుగా తీసిన ఒక వీడియో సోషల్ మీడియా అంతా వైరల్ కావటంతో ఈ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. 

ఆ అమ్మాయి సూసైడ్ నోటులో రాసిన చూసిన వారికెవ్వరికీ కన్నీళ్ళు ఆగవు. అందులో ఉన్న భయంకర నిజాలు చూస్తే మనుషులు ఇంత రాక్షసంగా   కూడా ప్రవర్తిస్తారా అనిపించక మానదు. తన తండ్రి, ఇద్దరు బాబాయిలు, వరసకు అన్న అయ్యే వ్యక్తి తనను,తల్లిని,తన తోడ బుట్టిన వారిని ఆస్తి విషయమై మానసికంగా రోజు హింసించే వారని తెలిపింది.       వారందరూ  తనను లైంగిక వేధించారని, తప్పుడుగా తనతో ప్రవర్తించారాని సభ్య సమాజం సిగ్గుతో తలాడించుకునే   భయానక వాస్తవాలను  ఆ నోటులో ఆ పసిహృదయం తెలియచేసింది.         అంతేకాదు తన తండ్రి, బాబాయిల పైశాచికత్వానికి ఉదాహరణగా, మానవత్వానికే మాయని మచ్చగా నిలిచే ఇంకొక  దారుణ సంఘటన కూడా తెలియచేసింది. ఇంతకు ముందు  తన తండ్రి  మొదటి భార్యను, గర్భస్థ శిశువుతో సహా వారి నలుగురి పిల్లలను హత్య చేశాడని తెలిపింది. బాబాయి కూడా ఇంతకు ముందు జైలుకి వెళ్ళి వచ్చాడని కూడా సూసైడ్ నోటులో రాసింది. 

తన భర్త తాను పని మీద బయటకు వెళ్ళినప్పుడు మిగతా ముగ్గురితో కలసి తన కూతురిని హత్య చేశాడని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.   తండ్రిని అరెస్ట్ చేశారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. సూసైడ్ నోటులో ఆ అమ్మాయి చేసిన అన్నీ ఆరోపణలపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు. నాగరిక సమాజంలో తిరుగున్న ఇటువంటి పశువులను కఠినంగా శిక్షించాలని, ఒక తప్పు చేయగానే వెంటనే శిక్ష పడితే మరిన్ని దారుణాలు జరుగా కుండా వుంటాయని మానసిక శాస్త్రవేత్తల అభిప్రాయం