ఇంటర్నెట్ డెస్క్: ఈ  రోజు మాత్రం 1461 కొత్త కేసులు రావటంతో,  దేశంలో మొత్తం కేసుల సంఖ్య 20004 కి పెరిగింది. మహారాష్ట్రలో మాత్రం 552 కేసులతో, మొత్తం కేసుల సంఖ్య 5218 కి పెరిగింది. గుజరాత్ లో పరిస్థితి రోజు రోజుకు ఆందోళన కరంగా తయారవుతోంది. ఈ ఒక్క రోజు మాత్రం గుజరాత్ లో 239 కొత్త కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్యలో మహారాష్ట్ర తరువాత స్థానంలో ఢిల్లీ బదులు ఇప్పుడు గుజరాత్ ఉంది. చీకట్లో ఆశా దీపంలాగా, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలలో కొత్తగా పొజిటివ్ అని నిర్ధారించిన కేసులకన్నా, వ్యాధినుండి కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఢిల్లీలో 75 కొత్త కేసులు రాగా, 180 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే తమిళనాడులో 76 కేసులు రాగా, కోలుకున్నవారి సంఖ్య 178.