`ఒక్క మనసు` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోయిన్  నిహారిక ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయింది. ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయింది. దీంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి వెబ్ సిరీస్‌లపై దృష్టి సారించింది. తాజాగా ఇన్‌స్ట్రాగ్రామ్ లైవ్‌లో ముచ్చటించిన నిహారిక పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. 

గ్లామరస్ పాత్రల్లో నటించడం గురించి ఇలా అంది .. `అవును. నేను గ్లామరస్ పాత్రల్లో కూడా కనిపించబోతున్నా.  త్వరలోనే  ఓ తమిళ సినిమా చేయబోతున్నా. అందులో నేను గ్లామరస్‌గానే కనిపిస్తా. గోవా బీచ్‌లో రొమాంటిక్ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నాం` అని నిహారిక తెలిపింది. అలాగే `పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా?` అనే ప్రశ్నకు స్పందిస్తూ.. `నేనేమైనా సమంతనా? పెళ్లి తర్వాత కూడా నటిస్తారా అని అడగడానికి. ఆ విషయం ఇప్పుడే చెప్పలేను.