ముంబై: అమెరికా డాలర్‌తో రూపాయి మారకపు విలువ ఆల్‌టైం కనిష్టానికి పడిపోయింది. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్లలో గందరగోళం, ఈక్విటీ మార్కెట్లు తిరిగి స్వదేశానికి రావడంతో మంగళవారం రూపాయి విలువ దారుణంగా పడిపోయింది. డాల్లర్  తో మారకం విలువ 76.79 వద్ద రోజును ప్రారంభించిన తరువాత రూపాయి 76.60-76.84 మధ్య ఊగిసలాడింది. నాలుగు గంటల సెషన్‌లో బలహీనమైన స్థాయిలో ఆల్-టైమ్ కనిష్టానికి  వచ్చేసింది. గత వారం రూపాయి 76.87కు పడిపోయింది. రూపాయి అత్యంత కనిష్ట స్థాయి ఇదే కావడం గమనార్హం.