హైదరాబాద్: ఫ్యాక్షన్‌ లీడర్‌ ఏపీ సీఎం కావడం ప్రజల దురదృష్టమని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. వైసీపీ మంత్రులు, నేతల భాషను ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల తీరుతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నెడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ చేతగానితనాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. వ్యక్తిగత దూషణలు చేయడం దిగజారుడుతనమేనని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా తిరుగుతున్నారన్నారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యే కరోనా సామాజిక వ్యాప్తి చెందుతుందని చెప్పారు. కరోనాపై వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దాస్తోందని రాష్ట్ర బిజేపి అధ్యక్షుడు అన్నారు.