చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న చిత్రం ‘నిశ్శబ్దం’. క్రితి ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ అసోసియేషన్‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్‌లో టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో కూడా చెప్పడం కష్టం. ఇలాంటి సమయంలో ఈ సినిమాపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా విడుదల కాబోతోందంటూ వస్తున్న వార్తలకు చిత్రయూనిట్ చెక్ పెట్టింది. అలాంటి వార్తలు నమ్మవద్దంటూ అధికారికంగా తెలియజేసింది.