అమరావతి:జగన్ సర్కార్ వచ్చినప్పటినుంచి ఇప్పటి దాకా 63 సార్లు కోర్టుల చేత అక్షింతలు, మొట్టికాయలు, చెంపదెబ్బలు ఏవేమీ ఉన్నాయో అనీ వేయించుకుంది. ప్రభుత్వ భవనాలకు మూడు రంగుల విషయంలో కోర్టు ధిక్కరణ నేరం కింద ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ నీలం సహాని కోర్టులో ఉన్నప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ పెద్ద దెబ్బ తగిలింది. చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని తొలగించడం రాజ్యాంగానికి వ్యతిరేకమని కోర్టు కొట్టివేసింది. స్థానికి ఎన్నికలు వాయిదా వేసినప్పటినుంచి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని  అధికార పక్ష నాయకులు దుమ్మెత్తి పోసారు.  రాష్ట్ర ప్రభుత్వం చివరకు ఆయనను తొలగించి, తమిళనాడుకు చెందిన జస్టిస్ ఆరోగ్యరాజ్  ను ఆ పదవికి ఎన్నిక చేసిన విషయం తెలిసిందే.ఆర్డినెన్సు కొట్టివేసినందువల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ చీఫ్ ఎలెక్షన్ కమిషనర్ పదవిలో కొనసాగుతున్నట్టే అని న్యాయవాది జంద్యాల శంకర్ తెలియచేసారు. న్యాయం జరిగిందని పిటీషనర్లలో  ఒకరైన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.