సౌత్ లో మంచి పేరు తెచ్చుకొని ఇతర భాషల నుంచి మంచి అవకాశాలు వస్తే కొందరు ఆ ఇండస్ట్రీ లోకి వెళ్ళి పోతూ ఉంటారు. ముఖ్యంగా బాలీవుడ్ నుంచి ఆఫర్ వస్తే ఆలోచించకుండా ఓకే చేసే హీరోయిన్లు కూడా ఉన్నారు.

 

ఇప్పటికే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సి, స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రకుల్ ప్రీత్ కూడా బాలీవుడ్ గాలి సోకగానే అటువైపుకి వెళ్లిపోయారు.

కానీ సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం వారికి పూర్తిగా భిన్నం అని చెప్పుకోవచ్చు. సౌత్ లో స్టార్ హీరోయిన్ల జాబితాలో మొదటి పేరు నయనతార దే అవుతుంది. ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలైనా, సీనియర్ హీరోల సినిమాలైనా దర్శకుల ఫస్ట్ ఛాయిస్ సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార అని చెప్పుకోవచ్చు.

తాజాగా బాలీవుడ్ లోని ఒక ప్రముఖ నిర్మాత నయనతారను ఒక భారీ బడ్జెట్ చిత్రం లో నటించమని కోరారట. కానీ నయనతార ఒప్పుకోలేదట. అయినా సరే పట్టువదలని విక్రమార్కుడిలా గా బోలెడు సార్లు ప్రయత్నించి నయనతార నుంచి చాలా సార్లు నో చెప్పించుకున్న ఆ నిర్మాత ఇక చేసేది లేక ఒక బాలీవుడ్ హీరోయిన్ ను పెట్టి సినిమాను మొదలుపెట్టారట.

ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు బాలీవుడ్ కి వెళ్లే ఆసక్తి లేదని ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల నుంచి వస్తున్న ఆఫర్లతో చాలా బిజీగా ఉన్నానని…. ఇక బాలీవుడ్ లో సినిమాలు చేసేంత తీరిక అసలు తనకు లేదని నయనతార చెప్పుకొచ్చింది. కారణం ఏదైనప్పటికీ తనను స్టార్ హీరోయిన్ ని చేసిన సౌత్ ఇండస్ట్రీని వదిలిపెట్టాలనే ఆలోచన నయనతారకు లేదన్నమాట.