రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కనున్న ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి.

రాజమౌళి దర్శకత్వంలో ‘బాహుబలి’ తర్వాత తెరకెక్కనున్న ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి ఇప్పటికే బోలెడు పుకార్లు బయటకు వచ్చాయి.

అయితే తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి రూమర్లపై రియాక్ట్ అయ్యారు. ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అనేది మరియు అసలు సినిమా కథ ఏంటి అనే విషయాలపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పిన రాజమౌళి అసలు విషయాన్ని మాత్రం దాచిపెట్టినట్లు తెలుస్తోంది.

రాజమౌళి చెప్పిన దాని ప్రకారం…. అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీమ్ ల జీవిత కథ ఆధారంగా ఈ సినిమా నడుస్తుందని చెప్పాడు. అసలు వీరిద్దరూ నిజ జీవితంలో కలిసి ఉంటే ఎలా ఉండేది? వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఉంటే, ఇద్దరూ ఒకరికొకరు ఇన్స్ పి రేషన్ అయ్యుంటే ఎలా ఉండేది? అనేదానిపై కథ నడుస్తుందని రాజమౌళి చెప్పారు.

కానీ అసలు కథ వేరే ఉందట. రాజమౌళి వారిద్దరి మధ్య స్నేహం గురించి మాత్రమే మాట్లాడారు కానీ ఈ సినిమాలో మాత్రం వారిద్దరి మధ్య ఒక భారీ యాక్షన్ సన్నివేశం కూడా ఉంటుందని తెలుస్తోంది.

బ్రిడ్జి పైన అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ మరియు కొమరం భీమ్ గా ఎన్టీఆర్ మధ్య జరిగే ఒక భీకరమైన పోరాటం సినిమాలో హైలైట్ గా నిలుస్తుదని చెబుతున్నారు. అదే కథలో ట్విస్ట్ అని కొందరు అంటున్నారు.