గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న హీరోలలో రవితేజ కూడా ఒకడు. వరుసగా మూడు డిజాస్టర్లు అందుకున్న రవితేజ ప్రస్తుతం ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ఇంకా పూర్తవ్వలేదు. అప్పుడే మరొక చిత్రాన్ని లైన్ లో పెట్టాడు రవితేజ. సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రానికి ‘కనకదుర్గ’ అనే టైటిల్ పెడదామని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రం స్క్రిప్టు కు ఫైనల్ టచ్ ఇస్తున్నారని, ఆ పని పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

ఒకవైపు ‘డిస్కో రాజా’ షూటింగ్ తో పాటు ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేయనున్నారు. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా తర్వాత రవితేజ మార్కెట్ బాగా పడిపోవడంతో ఈ రెండు సినిమాల పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు మాస్ మహారాజా.

ఈ నేపథ్యంలోనే అమ్మాయి పేరు ను పెట్టుకుంటే కలిసొస్తుంది అని ఈ సినిమాకు ‘కనకదుర్గ’ అనే టైటిల్ పెట్టడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ ఈ పేరు రవితేజ కు ఎంత వరకు కలిసి వస్తుందో వేచి చూడాలి.