హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఒక అమ్మాయిపై ఆమె స్నేహితుడే దాడి చేశాడు. స్నేహితుడు చెప్పిన మాటలు నమ్మి 16 ఏళ్ల అమ్మాయి దోమలగూడలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్ళింది. అక్కడే ఇద్దరూ గంజాయి సేవించారు. అనంతరం అమ్మాయిపై యువకుడు దాడి చేశాడు.

మత్తులో యువతిని బ్లేడ్‌తో కోశాడు. అమ్మాయిని వివస్త్రను చేశాడు. ప్రైవేట్‌ పార్ట్స్‌పైనా బ్లేడ్‌తో దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. అమ్మాయి ఆర్తనాదాలు చేయడంతో అటుగా వెళ్తున్న స్థానికులు వెళ్లి చూడగా… అమ్మాయి రక్తపు మడుగులో పడి ఉంది.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాంధీ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికులు చితకబాది యువకుడిని పోలీసులకు అప్పగించారు. ఫోక్సో చట్టం కింద యువకుడిపై కేసు నమోదు చేశారు. అమ్మాయికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.