సికింద్రాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్‌ విద్యార్థి పరీక్ష రాస్తూ ఎగ్జామ్‌ హాల్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్‌లోని శ్రీచైతన్య కాలేజీలో ఈ ఘటన జరిగింది. 

పరీక్ష రాస్తున్న సమయంలో టెన్షన్‌కు లోనవడం వల్ల గుండెపోటు రావడంతో ఒక్కసారిగా విద్యార్ది గోపిరాజు కుప్పకూలి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు విడిచాడు. మృతుడు గోపిరాజు స్వస్థలం ఎల్లారెడ్డిగూడెం. గోపిరాజు ఇంటర్‌  చదువుతున్నాడు.