వరంగల్‌లో దారుణం జరిగింది. విద్యార్థినిపై క్లాస్‌రూంలోనే దాడి జరిగింది. రవళి అనే విద్యార్థినిపై తోటి విద్యార్థి అవినాష్ పెట్రోల్
పోసి నిప్పంటించాడు.

రవళి వాగ్దేవి కాలేజీలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఉదయం రవళి కాలేజీకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడే ఉన్న అవినాష్‌… రవళి క్లాస్‌ రూంలోకి వెళ్లగానే ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ముఖం పూర్తిగా కాలిపోయింది. వెంటనే ఆమెను కాలేజీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రేమ విషయంలో వీరి ఇద్దరి మధ్య గొడవ నడుస్తున్నట్టు చెబుతున్నారు. ప్రేమించాల్సిందిగా రవళి వెంట అవినాష్ పడుతున్నాడు. ఈ విషయంలోనే కక్ష పెంచుకున్న అవినాష్ ఇలా దాడి చేసినట్టు 
చెబుతున్నారు. దాడి చేసిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన అవినాష్‌ను విద్యార్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

పెట్రోల్ పోసి అంటించడంతో రవళి శరీరం దాదాపు 80 శాతం కాలిపోయింది. గతంలోనూ ఒకసారి వరంగల్‌లో ఇలాగే విద్యార్థినులపై యాసిడ్ దాడి జరిగింది. ఆసమయంలో యాసిడ్ దాడి చేసిన యువకులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసేశారు.