వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి కొద్ది మాసాలముందే…టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి మరో చిక్కు వచ్చి పడింది. గత కొద్ది మాసాలుగా భార్య, కుమార్తెకు దూరంగా ఉంటున్న షమీపై… కోల్ కతాలో వరకట్నం వేధింపుల కేసు నమోదయ్యింది. తనను భర్త షమీతో పాటు అత్తింటివారు వేధిస్తున్నారంటూ గతంలోనే హసీన్ జమాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

షమీపై…498-A, 354-A  కేసులు నమోదయ్యాయి. అయితే …టీమిండియా టెస్ట్, వన్డే జట్ల బౌలింగ్ కే వెన్నెముకగా నిలిచిన మహ్మద్ షమీ…క్రికెటర్ గా ఏడాదికి వివిధ రూపాలలో 10 కోట్ల రూపాయల వరకూ ఆర్జిస్తున్నాడు. అలాంటి షమీ… భార్యను అదనపుకట్నం తీసుకురావాలంటూ వేధించినట్లుగా కేసు నమోదు కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మహ్మద్ షమీ ఐపీఎల్ ఆడుతున్న సమయంలో చీర్ గాళ్స్ బృందానికి చెందిన హసీన్ జమాన్ ను ప్రేమించి, పెళ్లాడి ఓ బిడ్డకు తండ్రిగా మారాడు.

వివాహానంతరం మహ్మద్ షమీ దుబాయ్ లోని ఓ యువతితో అక్రమసంబంధం పెట్టుకొన్నాడంటూ హసీన్ జమాన్ ఆందోళనకు దిగడంతో….షమీ గత కొద్ది నెలలుగా భార్యాబిడ్డకు దూరంగా ఉంటూ వస్తున్నాడు.