భారత టెన్నిస్ క్వీన్, ప్రపంచ మహిళా డబుల్స్ మాజీ నంబర్ వన్ సానియా మీర్జా… ఏడాది విరామం తర్వాత… ఓ బిడ్డకు తల్లిగా తిరిగి టెన్నిస్ బరిలోదిగటానికి తహతహలాడుతోంది.

ఐదుమాసాల క్రితమే మగబిడ్డకు జన్మనిచ్చిన సానియా…. కాన్పు తర్వాత విపరీతమైన బరువుతో  ఫిట్ నెస్ కు దూరమయ్యింది.

అయితే…అంతర్జాతీయ టెన్నిస్ లో రాణించాలంటే పూర్తి ఫిట్ నెస్ అవసరమని గ్రహించిన సానియా…తన కుమారుడికి ఆరోనెల రావడంతో… జిమ్ బాట పట్టింది.

రోజుకు ఐదుగంటలపాటు జిమ్ లోనే గడుపుతూ కసరత్తులు చేస్తోంది. గత మూడు మాసాలలో ఏకంగా 22 కిలోలు బరువు తగ్గి వావ్ అనిపించుకొంది. ఆగస్టు నెలలో జరిగే యూఎస్ ఓపెన్ లో పాల్గొనాలన్నదే తన లక్ష్యమని ప్రకటించింది.

32 ఏళ్ల సానియా…ఆస్ట్రేలియా ట్రైనర్ రాబర్ట్ బాలార్డ్ పర్యవేక్షణలో ఫిట్ నెస్ కార్యక్రమంలో పాల్గొంటోంది. ప్రస్తుతం తాను డబుల్స్ కే పరిమితమైనా…సింగిల్స్ ప్లేయర్ కు అవసరమైన ఫిట్ నెస్ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.

బాబుకు జన్మనివ్వడానికి ముందు…టెన్నిస్ ప్లేయర్ గా తాను పడిన కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం లభించిందని, కాన్పు ముగిసిన ఐదోమాసం నుంచే తనకున్న అవగాహనతో ఫిట్ నెస్ ఎక్సర్ సైజెస్ తో బరువు తగ్గించుకోగలిగానని… మహిళలు అందంగా, నాజూకుగా ఉంటే తనకు ఎంతో ఇష్టమని సానియా సోషల్ మీడియా ద్వారా తెలిపింది.